న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తోపాటు మరో ఎనిమిది మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడ్డారు. సూపర్‌బగ్‌గా పిలిచే ‘ఎంటరోబ్యాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియా ఐఎస్ఎస్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
శ్వాస వ్యవస్థపై దుష్ప్రభావం చూపే ఈ బ్యాక్టీరియా వ్యోమగాములకు ఇబ్బందులను సృష్టించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.