గౌహతి: బీజేపీ సీనియర్ నేత, త్రిపురలోని సుర్మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ గుండు గీయించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన సరిగా లేదని, ఆ పార్టీ చేసిన తప్పులకు తాను గుండు గీయించుకున్నట్లు చెప్పారు. అయితే కోల్‌కతాలోని కాళీఘట్ ఆలయం వద్ద ఆయన తన తలనీలాలను అర్పించారు. త్రిపురలో బీజేపీ రాజకీయ అరాచకానికి పాల్పడుతోందని, గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలన పట్ల త్రిపుర ప్రజలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. అందుకే తాను ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. అయితే ఆశిష్ దాస్ త్వరలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భవానీపూర్‌లో మమతా బెనర్జీ విజయం సాధించడం పట్ల ఆశిష్ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అతను పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు.