శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. (Earthquake) దీంతో ప్రజలు భయాందోళన చెందారు. తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. భూమి లోపల 209 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు వివరించింది.
కాగా, భూకంపం వల్ల జమ్ముకశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో భూ ప్రకంపనలు కనిపించాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో గతంలో కూడా భూకంపాలు సంభవించాయి. భారీగా విధ్వంసం సృష్టించాయి.