జైపూర్: రాజస్థాన్(Rajasthan)లో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. ఓ గిరిజన మహిళను కొట్టి, బట్టలు ఊడదీసి, నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన ప్రతాప్‌ఘర్ జిల్లాలో జరిగింది. ఆమె భర్త, మరుదులే ఈ ఘాతూనికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గురువారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి ముందే భార్యను వివస్త్రను చేసిన భర్త వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆదుకోవాలని ఆమె అరుస్తున్నా.. భర్త మాత్రం వినిపించుకోకుండా భార్యను అందరి ముందు వివస్త్రను చేశాడు.
మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్న కారణంగా ఆమెపై అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. పెళ్లి చేసుకున్న ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమెను కిడ్నాప్ చేసి ఊరికి తీసుకువెళ్లి ఇంటి ముందే ఆ మహిళను వివస్త్రను చేసి వేధించారు. ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. ఈ ఘటనను సీఎం అశోక్ గెహ్లాట్ ఖండించారు.