మాస్కో, అక్టోబర్ 28: భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా వీసా నిబంధనలను సడలించడంపై ఈ ఏడాది జూన్‌లో భారత్‌తో చర్చలు జరిపింది. ఇందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందం పురోగమన దశలో ఉన్నదని, దీంతో వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్ (వసంత కాలం) నాటికి భారతీయులకు వీసా రహిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రావొచ్చని మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్ యెవ్గెనీ కొజ్లోవ్ వెల్లడించినట్టు ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక పేర్కొన్నది. రష్యా వెళ్లే భారతీయులకు నిరుడు ఆగస్టు 1 నుంచి ఈ-వీసాలు లభిస్తున్నాయి. వీటి జారీకి 4 రోజుల సమయం పడుతున్నది.
జమ్ములో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి ; ముష్కరుల్లో ఒకరు హతం
న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భద్రతా బలగాలు వమ్ము చేశాయి. సోమవారం తెల్లవారుజామున జమ్ము అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డారు. వాహనశ్రేణిలోని అంబులెన్స్‌ను టార్గెట్ చేశారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ‘మరో ఇద్దరు ఉగ్రవాదులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. జమ్ము నగరానికి 85 కిలోమీటర్ల దూరంలో అ ఖ్నూర్ సెక్టార్‌లోని బట్టాల్ ప్రాం తంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.