పుణె: మహారాష్ట్ర పుణె జిల్లాలో బారామతి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో శనివారం శిక్షణ విమానం ఒకటి క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి మరోచోటకు దూసుకెళ్లింది. ప్రమాద ఘటన నుంచి అదృష్టవశాత్తు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవ్వరికీ ఎలాంటి హాని కలగలేదని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘రెడ్‌బర్డ్ ఫ్లైట్’ అనే ట్రెయినింగ్ సెంటర్‌కు చెందిన ఈ విమానం గాల్లో ఉండగా దాని టైర్ దెబ్బతిన్న సంగతిని పైలట్ గుర్తించాడు. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించగా విమానం ముందు టైర్ ఊడిపోయి క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.