Spam Calls | న్యూఢిల్లీ : ఫోన్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్ కాల్స్‌కు కళ్లెం వేసేందుకు ట్రాయ్ సిద్ధమవుతున్నది. వాణిజ్య సమాచారం, ప్రకటనలను కస్టమర్లు స్వీకరించేందుకు ఇచ్చే అనుమతులను ట్రాయ్ డిజిటల్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంకు బదిలీ చేసేందుకు ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించబోతున్నట్టు ట్రాయ్ చైర్మన్ లహోటీ తెలిపారు.
క్రమబద్ధీకరణ ప్రక్రియను గాడిలో పెట్టడం కోసం ఉద్దేశించిన ఈ చర్యలు కస్టమర్లు ప్రస్తుతం ఇచ్చిన అనుమతులను తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఆ అనుమతులను ఉపసంహరించుకునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తాయి. వాయిస్ కాల్స్‌కు, ఎస్ఎంఎస్కు వేర్వేరుగా స్పెషల్ టారిఫ్ వోచర్స్ (ఎస్టీవీ)లను ఆఫర్ చేయాలని ఇటీవల ట్రాయ్ నిబంధన తీసుకొచ్చింది.