ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వహించడమే అతికష్టమైన పని. ఎండకు ఎండుతూ.. వర్షంలో తడుస్తూ.. చలిలో వణుకుతూ విధులు నిర్వహిస్తుంటారు. వర్షం కురిసినప్పుడు వాళ్ల బాధలు వర్ణణాతీతం. బెంగళూరులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపైకి నీళ్లు చేరి ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఓ రహదారిపై డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో నీళ్లు నిలిచిపోయాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ తనకెందుకులే అనుకోకుండా చేతులతో ఆ డ్రైనేజీని క్లీన్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ట్రాఫిక్ పోలీసుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విటర్లో షేర్ చేశారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ జగదీశ్‌రెడ్డి తన చేత్తో డ్రైనేజీని శుభ్రం చేశారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. రోడ్లు క్లీనర్లు, ఇతర సిబ్బంది కోసం ఎదురుచూడకుండా ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ప్రయత్నించారు. ఇది అతని కర్తవ్య స్ఫూర్తిని, అంకితభావాన్ని తెలియజేస్తున్నదని ఐపీఎస్ అధికారి దీపాంశు మెచ్చుకున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. నెటిజన్లంతా ట్రాఫిక్ పోలీస్ జగదీశ్‌రెడ్డిని హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి మంచి విషయాలను హైలైట్ చేయాలని పలువురు కామెంట్ చేశారు.
#Bangaluru ट्रैफिक ऑफिसर #JagdishReddy ने अपने हाथ से नाली के मुहाने पर जमा कचरा साफ किया ताकि सड़क में जमा वर्षाज़ल निकले और आमजनों को दिक्कत ना हो.
Commendable work. ये काम उनके Job Role में नहीं आता है, फिर भी ऐसा करना उनकी सेवा भावना व ड्यूटी के प्रति समर्पण दिखलाता है. pic.twitter.com/6Ue0naF3fl
— Dipanshu Kabra (@ipskabra) June 20, 2022