న్యూఢిల్లీ : భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకం విధించిన అనంతరం ప్రతిష్టంభనకు గురైన భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరిపేందుకు అమెరికా ప్రభుత్వ ప్రధాన సంధానకర్త బ్రెండన్ లించ్ సోమవారం అర్ధరాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు.
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ)పై ఇప్పటివరకు ఐదు విడతల చర్చలు జరగగా ఆగస్టు 25-29 మధ్య జరగవలసిన ఆరవ విడత చర్చలు భారతీయ వస్తువులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం సుంకాలు విధించడంతో వాయిదాపడ్డాయి.