పుణె: మహారాష్ట్రలోని పుణెలో రియల్టర్ కేతన్‌ను అతని ప్రియురాలే కొండపై నుంచి తోసేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కేతన్ హత్య చోటు చేసుకున్న లోహగఢ్ కోట ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడంతో పర్యాటకులు దానిని దర్శించడానికి పోటెత్తుతున్నారు. వర్షాకాలంలో వారాంతంలో ఈ కోటను 10 వేల మంది వరకు, మామూలు రోజుల్లో 800 నుంచి వెయ్యి మంది వరకు పర్యాటకులు సందర్శిస్తుంటారు.
అయితే ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో జూన్‌లో ఈ ఘటన జరగక ముందు పర్యాటకుల సంఖ్య సాధారణం కన్నా తగ్గింది. అయితే కేతన్ ఉదంతం జరిగిన తర్వాత మరాఠా వారసత్వానికి, వర్షాకాలంలో ప్రకృతి రమణీయతతో ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఈ కోటకు అనూహ్యంగా పర్యాటకుల సంఖ్య పెరిగింది.