Buddist Monk : ఓ పదిహేనేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లు శ్రీలంక (Srilanka) కు చెందిన 71 ఏళ్ల బౌద్ధ సన్యాసి (Buddist Monk) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పల్లెగామ హేమరథ (Pallegama Hemaratha) ను పోలీసులు అరెస్టు చేశారు.హేమరథ ప్రస్తుతం శ్రీలంకలోని ప్రసిద్ధ ఆలయానికి ప్రధాన భిక్షువుగా ఉన్నారు. హేమరథ అకృత్యానికి బాలిక తల్లే సహకరించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనురాధపురలోని మేజిస్ట్రేట్ కోర్టు బాలిక తల్లిపైనా అరెస్టు వారెంటు జారీ చేసింది. హేమరథ ఆలయ ఆవరణలో ఒక బాలికను అపహరించి నిర్బంధించినట్లు గత మార్చి నెలలోనే ఫిర్యాదు నమోదైంది. విచారణలో మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. కొలంబోలోని ప్రైవేటు ఆసుపత్రి ఎమర్జెన్సీ యూనిట్లో చికిత్స పొందుతుండగా హేమరథనను, బాలిక తల్లిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.