హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ దరఖాస్తుల గడువును 22 వరకు పొడగించారు. ఈ పరీక్షను నవంబర్ 29న నిర్వహించనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : చేయూత నూతన పెన్షన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం ఒక రోజుకు పొడిగించింది. మంత్రి సీతక్క ఆదేశాలతో బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.