బెంగళూరు: రథోత్సవంలో అపశృతి జరిగింది. తాడు తెగడంతో రథం పైభాగం కూలిపోయింది. దీంతో భక్తులు భయాందోళన చెందారు. దూరంగా పరుగెత్తారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Top Portion Of Chariot Collapses) కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముల్కి పట్టణం సమీపంలోని బప్పనాడు గ్రామంలో శాంభవి నది ఒడ్డున దుర్గాపరమేశ్వరి ఆలయం ఉన్నది. ప్రతి ఏటా ఏప్రిల్లో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మరథోత్సవం జరుపుతారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. దేవతతో పాటు పూజారులున్న రథాన్ని వేలాది మంది భక్తులు లాగారు.
కాగా, బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అపశృతి జరిగింది. ఒక రథానికి కట్టిన తాడు తెగిపోయింది. దీంతో విద్యుత్ అలంకరణతో ఉన్న రథం పైభాగం కూలిపోయింది. అప్రమత్తమైన భక్తులు దూరంగా పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మిగతా రథాలతో ఊరేగింపును కొనసాగించారు. అయితే రథం పైభాగం కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ಬಪ್ಪನಾಡು ಶ್ರೀದುರ್ಗಾಪರಮೇಶ್ವರಿ ದೇವಳದ ರಥೋತ್ಸವ ಅದ್ಧೂರಿಯಾಗಿ ಸಾಗಿತ್ತು. ರಥ ಬೀದಿಗಳಲ್ಲಿ ರಥೋತ್ಸವ ಸಾಗುತ್ತಿದ್ದ ವೇಳೆ ತೇರಿನ ಮೇಲ್ಭಾಗ ಏಕಾಏಕಿ ಕುಸಿದಿದೆ. ತೇರಿನ ಮೇಲ್ಬಾಗ ಕುಸಿದ ವೇಳೆ ಅರ್ಚಕರು ತೇರಿನಲ್ಲೇ ಇದ್ದರು, ಅದೃಷ್ಟವಶಾತ್ ಯಾವುದೇ ಅಪಾಯ ಉಂಟಾಗದೆ ಪಾರಾಗಿದ್ದಾರೆ.@XpressBengaluru pic.twitter.com/vPdyI8w961
— kannadaprabha (@KannadaPrabha) April 19, 2025