బారాముల్లా ఎన్కౌంటర్లో లష్కరే కమాండర్ హతం
Yousuf Kantroo | జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూ (Yousuf Kantroo) హతమయ్యాడు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూ (Yousuf Kantroo) హతమయ్యాడు. బారాముల్లాలోని వాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుద్గాం పోలీసులు, భద్రతా దళాలు గురువారం తెల్లవారుజామున గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిజగా జరిపిన కాల్పుల్లో లష్కరే కమాండర్ యూసుఫ్ మృతిచెందాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. బుద్గాం జిల్లాలో ఎస్పీవో, అతని సోదరుడు, సాధారణ పౌరులను చంపడంలో అతని పాత్రకూడా ఉందన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని చెప్పారు. వారిని దవాఖానకు తరలించామని, ప్రస్తుతం వారి క్షేమంగా ఉన్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

