హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : జర్మనీలో చెఫ్/కుక్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టామ్‌కామ్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. హోటల్ మేనేజ్మెంట్ లేక హాస్పిటాలిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ, లేక డిప్లొమా ఉన్నవారు అర్హులని పేర్కొన్నది.
కనీసం 2-5 ఏండ్ల అనుభవం ఉండాలని తెలిపింది. 22-35 ఏండ్ల మధ్య వయస్సు, ఆంగ్లంలో కమ్యూనికేషన్ నైపుణ్యం తప్పనిసరి అని సూచించింది. ఆసక్తిగలవారు tomcom. resume@gmail.com అడ్రస్‌కు దరఖాస్తులను పంపాలని కోరింది.