న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రెగ్యులర్గా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలిగే సూచనలు కనిపిస్తున్నాయి! త్వరలో కేంద్రం నెలవారీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డును దేశంలోని అన్ని టోల్ బూత్ల వద్ద ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్డు కలిగి ఉన్నవారికి టోల్ చార్జీల్లో కొంత రాయితీని కూడా ఇవ్వనున్నట్టు సమాచారం.
ఈ కొత్త స్మార్ట్ కార్డులు వాణిజ్య వాహనాలకు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి. అయితే నెలవారీ పాస్ తీసుకోనివారు రాయితీకి అర్హత పొందుతారా లేదా అనే విషయమై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. స్మార్ట్ కార్డులను ప్రవేశపెడితే టోల్ చార్జీల చెల్లింపు సరళతరం, సులభతరం అవుతుందని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.