న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan) ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏడు మంది మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేయడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆ కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి కోసం త్వరలో ఎన్నికలను నిర్వహించనున్నారు. దీని కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల నామినేషన్ ఫైలింగ్ కోసం ఇవాళే ఆఖరి తేది. అయితే ఈసారి రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులు ఎవరూ పాల్గొనడం లేదని, ఎవరు కూడా నామినేషన్ వేయడం లేదని ఎంపీ బ్రిజ్ భూషణ్ తెలిపారు.
#WATCH | Delhi: Former WFI president and BJP MP Brij Bhushan Sharan Singh says, "Today is the last day for filing of nominations for the federation’s elections (Wrestling Federation of India, WFI)…Nobody from my family is filing a nomination." pic.twitter.com/J1dSNulZG1
— ANI (@ANI) July 31, 2023