బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం.. నూతన సాంకేతికతల పనితీరు పరిశీలన..!
Brahmos missile: భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ నూతన వెర్షన్‌ను ఇవాళ టెస్ట్ చేసింది. ఒడిశా తీరంలోని

బాలాసోర్: భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ నూతన వెర్షన్‌ను ఇవాళ టెస్ట్ చేసింది. ఒడిశా తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్‌కు తాజాగా కొన్ని నూతన సాంకేతికతలను జోడించారు.
ఆ నూతన సాంకేతికతలు విజయవంతంగా పనిచేస్తాయా.. లేదా..? అనేది నిర్ధారణ చేసుకోవడం కోసం ఇవాళ పరీక్షించి చూశారు. ఈ పరీక్ష విజయవంతమైంది. నూతన సాంకేతికతలు సమర్థంగా పనిచేస్తున్నాయని రుజువైంది. సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంగల ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను భారత్‌కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవోఎం కలిసి అభివృద్ధి చేశాయి.
ఈ క్షిపణులను భూమి మీద నుంచి, ఆకాశం పైనుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను యాంటీషిప్, లాండ్ ఎటాక్ ఇలా రెండు పాత్రలు పోషించేలా రెండు రకాలుగా డిజైన్ చేశారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ఇప్పటికే ఇండియన్ నేవీలో, ఇండియన్ ఆర్మీలో సమర్థంగా వినియోగిస్తున్నారని డీఆర్డీవో తెలిపింది.
#WATCH | Today India successfully testfired a new version of the BrahMos supersonic cruise missile off the coast of Odisha in Balasore. The missile was equipped with new technological developments which were successfully proven
— ANI (@ANI) January 20, 2022
(Video source: DRDO) pic.twitter.com/VdGSYW10W5
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

