జమ్ముకశ్మీర్: పవిత్ర అమర్నాథ్ గుహలో ఇవాళ ఉదయం అర్చకులు హారతి కార్యక్రమ నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర రెండో రోజైన శనివారం తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ హారతి కార్యక్రమం ద్వారా ఆ పరమశివుడిని పూజించారు. ఈ హారతి కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | ‘Aarti’ performed at Shri Amarnath Cave Shrine in Jammu & Kashmir, today morning
(Video source: Shri Amarnath Ji Shrine Board) pic.twitter.com/SmyaWcLmsj
— ANI (@ANI) July 2, 2023
కాగా, ఈ ఏడాదికి సంబంధించిన అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమైంది. శనివారం యాత్ర ప్రారంభంకాగానే ‘హరహర మహాదేవ’ అనే నామస్మరణతో భక్తులు ముందుకు కదిలారు. మొదటి విడతగా 6 వేల మందిని పంపించారు. యాత్రికుల క్షేమం కోసం అడుగడుగున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 62 రోజులుపాటే సాగే ఈ యాత్రి ఆగస్టు 31న ముగియనుంది.