నాగ్‌పూర్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి దానికింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారు రైల్వే ట్రాక్‌పై పడటం చూసిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో కలిసి క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవాళ ఉదయం ఐదుగురు వ్యక్తులు ఓ ఎర్ర కారులో వెళ్తుండగా నాగ్‌పూర్‌లోని బోర్ఖెడి ఫ్లైవోవర్‌పై కారు అదుతప్పి, ఆ ఫ్లైఓవర్ కింద ఉన్న రైల్వేట్రాక్‌పై పడిందని బుటిబోరి స్టేషన్ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ట్రాక్‌పై రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
Maharashtra | Today at around 7.30 am, a speeding car fell on the railway track from the Borkhedi flyover in Nagpur. 5 people travelling in the car were injured in the accident. The injured have been admitted to a local private hospital for treatment: Butibori Police pic.twitter.com/49sAqICtEb
— ANI (@ANI) July 2, 2023