తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు (Wayanad landslides) విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. గుహలో తలదాచుకున్న వారంతా అక్కడ చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ అటవీ శాఖ అధికారుల బృందం పెద్ద సాహసం చేసింది. కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కే హషీష్ నేతృత్వంలోని నలుగురు సభ్యులు నాలుగున్నర గంటలపాటు నడిచి ఆ కొండపైకి చేరుకున్నారు.
కాగా, లోయకు ఎదురుగా కొండపై ఉన్న గుహలో చిక్కుకున్న తన పిల్లలు, భర్తకు ఆహారం కోసం అక్కడ తిరుగుతున్న మహిళ, ఆమె నాలుగేళ్ల చిన్నారిని అటవీ శాఖ బృందం గుర్తించారు. ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సున్న నలుగురు పిల్లలు, భార్యాభర్తలతో కూడిన గిరిజన కుటుంబాన్ని వారు కాపాడారు. వయనాడ్‌లోని పానియా గిరిజన కమ్యూనిటీకి చెందిన కుటుంబమని ఫారెస్ట్ అధికారి హషీష్ తెలిపారు.
మరోవైపు 8 గంటలకుపైగా కొండ, అటవీ ప్రాంతంలో నడిచి గిరిజన కుటుంబాన్ని కాపాడిన అటవీ శాఖ అధికారుల సాహసాన్ని సీఎం విజయన్ ప్రశంసించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Kerala: Forest department personnel rescued six tribals, including four children, from a landslide-affected area in #Wayanad.#WayanadLandslide pic.twitter.com/S0xZeddrB9
— All India Radio News (@airnewsalerts) August 3, 2024