Infant Dies | శిశువుకు శ్వాసకోశ వ్యాధి.. నయం చేసేందుకు వాతలు పెట్టడంతో మృతి
Infant Dies | శిశువుకు శ్వాసకోశ వ్యాధి సోకింది. అయితే మూఢ నమ్మకంతో రోగం నయం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్‌తో శిశువుకు వాతలు పెట్టారు. ఈ నేపథ్యంలో పసి బాబు మరణించాడు.
భోపాల్: శిశువుకు శ్వాసకోశ వ్యాధి సోకింది. అయితే మూఢ నమ్మకంతో రోగం నయం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్‌తో శిశువుకు వాతలు పెట్టారు. ఈ నేపథ్యంలో పసి బాబు మరణించాడు. (Infant Dies) మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంధ్వా గ్రామంలో నెలన్నర రోజుల కిందట పుట్టిన శిశువుకు న్యూమోనియా సోకింది. శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆ పసి బిడ్డ రోగం నయం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. మూఢ నమ్మకంతో కాల్చిన ఇనుప రాడ్‌తో శిశువు శరీరంపై వాతలు పెట్టారు.
కాగా, కాలిన గాయాలైన పసి బిడ్డ అనారోగ్యం మరింతగా క్షిణించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు డిసెంబర్ 21న జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో ఉంచి చికిత్స అందించినట్లు డాక్టర్ జీఎస్ పరిహార్ తెలిపారు. అయితే శుక్రవారం ఆ పసి బాబు మరణించినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Branded
- Dies
- Hot Iron Rod
- Infant
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

