Actor Vijay : అధికార డీఎంకే (DMK) పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్ (TVK chief), నటుడు విజయ్ (Actor Vijay) తీవ్ర ఆరోపణలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో ఆగిపోయిన తన ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ఇవాళ్టి నుంచి పునఃప్రారంభించారు. ఈ మేరకు కాంచీపురం (Kanchipuram) జిల్లాలోని మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన శ్రేణులతో క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంకేపై విమర్శలు గుప్పించారు. డీఎంకేది దోపిడీ భావజాలమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలకు, ర్యాడికల్స్‌కు నిలయమని విమర్శించారు. సమానత్వం కోసం తన పాలసీలను ఆయన వివరించారు. పేద, పెద్ద అనే తేడా చూపకుండా అందరినీ సమానంగా చూడాలనేదే తన పార్టీ పాలసీ అని చెప్పారు.
కరూర్ తొక్కిసలాట అనుభవం నేపథ్యంలో ఈ సమావేశానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సదస్సు కోసం ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణాన్ని ఎంచుకొన్నారు. దాదాపు 1500 మందికి క్యూఆర్‌కోడ్ పాస్‌లు ఇచ్చి.. వారిని మాత్రమే అనుమతించారు. సభకు వచ్చే వారి కోసం ఆహారం, నీరు, ఇతర ఏర్పాట్లు చేశారు. అనుమతులు లేనివారు రాకుండా ప్రాంగణం చుట్టూ షీట్లు అమర్చారు.