కోల్కతా: పశ్చిమబెంగాల్లో 2021 ఎన్నికల తర్వాత హింస కేసు లో నిందితునిగా ఉన్న ఒక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తను పోలీసు లు అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక ఇంటిలో దాక్కున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు ఆ ఇంటిపై దాడి చేయగా, అత ను చీరల కుప్ప కింద దాక్కొని ఉండటాన్ని గుర్తించి పట్టుకున్నారు. నాటి హింసాత్మక ఘటనల తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకోనేందుకు చీరల కుప్పలో దాక్కోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. నిందితుడిని ఉదయపూర్ నివాసి బ్రహ్మానంద చక్రవర్తిగా పోలీసులు గుర్తించారు.