కోర్టుల్లో స్థానిక భాషనే ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ సూచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంపై తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ మాట్లాడారు. హైకోర్టు జడ్జీలుగా ఇతర రాష్ట్రాల వారు వచ్చినప్పుడు స్థానిక భాష ప్రోత్సాహం ఎలా వుంటుంది? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా జిల్లా స్థాయి కోర్టుల్లో ఏవైనా కార్యక్రమాలు జరిగితే స్థానిక భాషలో మాట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. న్యాయం అన్న పేరుతో ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారని ఆమె ప్రశ్నించారు. పెండింగ్ కేసులు 54.64 శాతం మేర వున్నాయని, 10 లక్షల మందికి 20 జడ్జీల చొప్పున మాత్రమే వున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
2016 నుంచి జిల్లా కోర్టులో 54.6 శాతం కేసులు పెండింగ్లో వుండిపోయాయి. 10 లక్షల జనాభాకు 20 మంది జడ్జీలు మాత్రమే వున్నారు. ఇంకా 6 వేల మంది జడ్జీల కొరత వుంది. క్రింది స్థాయి కోర్టుల్లో 5 వేల మంది జడ్జీల కొరత వుంది. ఇంకా ఎన్ని రోజులు న్యాయం పేర ప్రజలను మోసం చేస్తారు? అంటూ టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్ విమర్శించారు.