కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్(MP Sougata Roy) పై ఆందోళనకారులు దాడి చేశారు. ఆయన కారుపై కోడిగుడ్లను విసిరేశారు. ఈ ఘటన బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాలో జరిగింది. టీఎంసీ నేత సౌగత్ రాయ్ ఓ దొంగ అంటూ ఆందోళనకారులు అరిచారు. నిమితా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు ఎంపీ సౌగత్ రాయ్ వెళ్లారు. నిమితాతో పాటు నార్త్ డమ్ డమ్ ప్రాంతాల్లో టీఎంసీ కౌన్సిలర్లపై దాడులు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. అయితే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి వెళ్తున్న సమయంలో డమ్ డమ్ ఎంపీపై దాడి చేశారు. ఓ గుంపు ఆయన వాహనాన్ని చుట్టుముట్టింది. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది.. సమస్యను అదపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
రాజీకయ కక్షతో నిరసనలు చేపట్టినట్లు ఎంపీ ఆరోపించారు.ఆ ప్రదర్శన వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకుని తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, గుడ్లు విసిరారని, ఇలాంటి రాజకీయాల దురదృష్టకరమని ఎంపీ సౌగత్ రాయ్ అన్నారు.ఈ ఘటనలో తమ పాత్ర లేదని బీజేపీ చెప్పింది. టీఎంసీ పాలన సమయంలో జరిగిన అక్రమాలు, అవినీతి పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు బీజేపీ పేర్కొన్నది.