న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ సందర్భంగా టీఎంసీ ఎంపీ ( TMC MP) మహువా మొయిత్ర రెండు కీలకాంశాలపై ప్రధాని స్పందించాలని పట్టుబట్టారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనల నేపధ్యంలో ఈ అంశాన్ని పరిష్కరించాలని ఆమె కోరారు.
అదానీ గ్రూపుపై హిందెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించిన క్రమంలో సెబీ విచారణపైనా దృష్టి సారించాలని మహువా మొయిత్ర పేర్కొన్నారు. మోదీజీ..మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఆదివారం లైవ్ టెలికాస్ట్ అవుతోంది. ముందుగా తాము లెవనెత్తే ఈ అంశాలపై వివరణ ఇవ్వండని ఆమె ట్వీట్ చేశారు. బీజేపీ భక్షకుల నుంచి భారత మహిళా రెజ్లర్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నామని మహువ మొయిత్ర నిలదీశారు.
సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్‌లోపు అదానీ అవకతవకలపై సెబీ విచారణ ఎందుకు ముగియలేదో చెప్పాలని ఆమె ప్రధాని మోదీని ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. మన్ కీ బాత్ ప్రస్ధానం తనకు ప్రత్యేకమైనదని మోదీ చెప్పుకొచ్చారు.
Read More
Liquor Vending mission | బటన్ నొక్కండి.. లిక్కర్ తీసుకెళ్లండి