శనివారం 16 జనవరి 2021
National - Dec 18, 2020 , 13:37:40

మ‌మ‌త‌కు మ‌ళ్లీ షాక్‌.. టీఎంసీని వీడ‌నున్న మ‌రో నేత‌

మ‌మ‌త‌కు మ‌ళ్లీ షాక్‌.. టీఎంసీని వీడ‌నున్న మ‌రో నేత‌

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతున్న‌ది. ఇప్ప‌టికే కీల‌క నేత సువేందుకు అధికారి, పండ‌వేశ్వ‌ర్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ ఉద‌యమే బార‌క్‌పూర్ ఎమ్మెల్యే షిభ‌ద్ర ద‌త్తా కూడా టీఎంసీ నుంచి వైదొలిగారు. కేవ‌లం 24 గంటల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు నేత‌లు పార్టీని వీడ‌టంతో ఉక్కిరిబిక్కిర‌వుతున్న తృణ‌మూల్‌కు, ఆ పార్టీ చీఫ్ మ‌మ‌తాబెన‌ర్జికి మ‌రో షాక్ త‌గిలింది. 

తృణ‌మూల్ కాంగ్రెస్‌కు చెందిన మ‌రో నాయ‌కుడు క‌బీరుల్ ఇస్లాం పార్టీ మైనారిటీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇప్ప‌టికే పార్టీని వీడిన నేత‌లంగా బీజేపీలో చేరేందుకు రంగం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో క‌బీరుల్ ఇస్లాం కూడా పార్టీని వీడుతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఇదిలావుంటే టీఎంసీ మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు, బెంగాల్ మాజీ మంత్రి శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జి కూడా తాను త్వ‌ర‌లో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.