న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీ(Health Insurance)పై ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు. అధిక పన్ను ప్రజలకు భారంగా మారుతున్నట్లు ఆయన తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లడారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే రకమైన డిమాండ్ చేసినట్లు ఆయన ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇండియాలో ఇన్సూరెన్స్ కేవలం 4 శాతమే ఉన్నదని, ప్రపంచవ్యాప్తంగా అది ఏడు శాతంగా ఉందని, బీమా రంగంలో అసమానతలు ఉన్నాయని, 75 శాతం జీవిత బీమా పాలసీలు ఉన్నాయని, మరో 25 శాతం వైద్య బీమాలు ఉన్నట్లు ఒబ్రెయిన్ తెలిపారు.
హెల్త్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని తగ్గించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఆర్థిక మంత్రి కనీసం రోడ్డు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ వ్యాఖ్యలను అయినా ఆలకించాలని టీఎంసీ ఎంపీ తెలిపారు.
జీఎస్టీ మండలి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఎంపీ ఒబ్రెయిన్ తిరస్కరించారు. ఆ వాదనలో వాస్తవం లేదన్నారు. మండలిలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్నదని, కావాలంటే దీన్ని మార్చవచ్చు అని తెలిపారు. జీఎస్టీ మండలి సాకుతో ఆర్థిక మంత్రి దాచుకోవడం సరికాదన్నారు. ఇది మధ్యతరగతికి చెందిన అంశమన్నారు. దీంట్లో రాజకీయం ఏమీలేదన్నారు. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు.
“REDUCE 18% GST ON HEALTH AND MEDICAL INSURANCE; has been there since (errata) 2017. Do not burden the middle class. FM can’t hide behind GST Council where NDA has numbers. FM must announce rollback in Parliament. If not, Andolan Chalu Rahega”
My intervention in Parliament today pic.twitter.com/WbKkC4ICz1
— Derek O’Brien | ডেরেক ও’ব্রায়েন (@derekobrienmp) August 5, 2024