న్యూఢిల్లీ, నవంబర్ 6: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నగదు, బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితర ఆస్తుల ద్వారా వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు.. విప్రో, నెస్లే, ఓఎన్జీసీ, ఐవోసీతో పాటు తదితర కంపెనీల మార్కెట్ ఆస్తుల కంటే ఎక్కువ. ఏడుకొండల స్వామికి బ్యాంకుల్లో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో రూ.16 వేల కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులు ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు వెల్లడించింది.