26 Lakhs Inside BMW | బీఎండబ్ల్యూ కారుకు ‘CATCHM3’ నంబర్ ప్లేట్.. అందులో రూ.26 లక్షలు
26 Lakhs Inside BMW | ఖరీదైన బీఎండబ్ల్యూ కారుకు ‘CATCHM3’ అని నంబర్ ప్లేట్ ఉన్నది. అనుమానించిన పోలీసులు దానిని తనిఖీ చేశారు. అందులో రూ.26 లక్షల డబ్బు ఉండటం చూసి షాక్ అయ్యారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
లక్నో: ఖరీదైన బీఎండబ్ల్యూ కారుకు ‘CATCHM3’ అని నంబర్ ప్లేట్ ఉన్నది. అనుమానించిన పోలీసులు దానిని తనిఖీ చేశారు. అందులో రూ.26 లక్షల డబ్బు ఉండటం చూసి షాక్ అయ్యారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి లక్నోలోని స్మృతి ఉపవన్ సమీపంలో నల్లటి అద్దాలు, ‘CATCHM3’ అనే నంబర్ ప్లేట్ కలిగిన లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, ఒక స్కార్పియో ఎస్‌యూవీని పోలీసులు గమనించారు. ఆ వాహనాల వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు.
కాగా, ఆ వ్యక్తుల గుర్తింపు పత్రాలు, వాహనాల పత్రాలు చూపించాలని పోలీసులు కోరారు. వారు ఆ పత్రాలు చూపించలేకపోవడంతో ‘ఈ-చలాన్’ యాప్ ద్వారా వాహనాల వివరాలు చెక్ చేశారు. బీఎండబ్ల్యూ కారు శివాన్షు కుమార్ పాండే పేరు మీద, స్కార్పియో వాహనం కృష్ణ కుమార్ సింగ్ పేరు మీద రిజిస్టరైనట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు ఆ వ్యక్తులను పోలీసులు ప్రశ్నినంచగా బీఎండబ్ల్యూ కారు డిక్కీలోపలున్న లాకర్లో డబ్బు ఉన్నదని, దానిని తాము లెక్కిస్తున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఆ కారును సోదా చేయగా అందులో రూ.26 లక్షలు లభించాయి. రూ.500 నోట్లు ఉన్న 52 కట్టలను పోలీసులు గుర్తించారు.
అయితే ఆ డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేదా పత్రాలను ఆ వ్యక్తులు చూపించలేకపోయారు. దీంతో ఆ క్యాష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. 21 ఏళ్ల శివాంశు పాండే, 19 ఏళ్ల రోచ్మన్ వర్మ, 21 ఏళ్ల రచిత్ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బీఎండబ్ల్యూ కారులో లభించిన రూ.26 లక్షల నగదుపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

