చండీఘడ్: ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి గుర్తు ఉందా?. దళిత మహిళ అయిన ఆమె 2015లో యూపీఎస్సీ టాప్ ర్యాంకర్. తొలుత అతర్ అమిర్ ఖాన్ను పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత సీనియర్ ఆఫసర్ ప్రదీప్ గవాండేను రెండో పెళ్లి చేసుకున్నది. సోషల్ మీడియాలో ఆ జంట పాపులర్ అయిన విషయం తెలిసిందే.
అయితే జైసల్మేర్లో కలెక్టర్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న టీనా.. ఇటీవల లీవ్ మీద వెళ్లిపోయింది. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో సహకరించిన స్థానికులు ఆమె థ్యాంక్స్ చెప్పింది. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆమె కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. తన ఆధ్వర్యంలో జైసల్మేర్లో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఆమె ఆ పోస్టులో చెప్పింది.
అయితే జైసల్మేర్ నుంచి టీనా ఎందుకు వెళ్లిపోయిందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేను పెళ్లి చేసుకున్న టీనా త్వరలో తల్లికాబోతున్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె మెటర్నిటీ లీవ్ తీసుకున్నట్లు పలు కథనాలు స్పష్టం చేశాయి.
గత ఏడాది టినా చాలా సింపుల్గా జరిగిన సెర్మనీలో గవాండేను పెళ్లి చేసుకున్నది. ఇటీవల తన సోదరి రియా దాబి పుట్టిన రోజు వేడుకల్లో టీనా పాల్గొన్నది. ఆ సమయంలో దిగిన ఫోటోలో టీనా బేబీ బంప్ కనిపించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.