న్యూఢిల్లీ, నవంబర్ 22: విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన వారు రాసే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది.
కోర్సు పూర్తిచేసిన 10 ఏండ్ల వరకు మాత్రమే ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుందనిప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు భారత్ కాకుండా ఇతర దేశాల్లో తమ చదువును కొనసాగించుకోవచ్చని ఎన్ఎంసీ పేర్కొన్నది.