ఇండోర్ : జైన మతాచారాల ప్రకారం మరణించే వరకు ఉపవాసం చేసే దీక్షను పాటించిన మూడేళ్ల బాలిక మరణించింది. ఐటీ ప్రొఫెషనల్స్ పీయూష్ జైన్, వర్ష జైన్ల కుమార్తె వియన (3)కు బ్రెయి న్ ట్యూమర్ ఉన్నట్లు నిరుడు డిసెంబరులో గుర్తించారు. ఆమెకు ముం బైలో శస్త్ర చికిత్స చేయించారు.
ఈ ఏడాది మార్చి నుంచి ఆమె ఆరో గ్యం క్షీణిస్తుండటంతో జైన సాధువు రాజేశ్ ముని మహరాజ్ వద్దకు తీసుకెళ్లారు. వియనకు మరణం ఆసన్నమైందని, పవిత్రమైన సంతారా ప్రతిజ్ఞ తీసుకోవాలని సలహా ఇచ్చా రు. ఆ తర్వాత బాలిక ప్రాణాలు కోల్పోయింది.