లక్నో: ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలోని ఓ రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు.
శనివారం బిల్లీ మార్కుండీ ప్రాంతంలోని క్వారీలో ఓ భాగం కూలిపోవటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల తొలగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారణాసి పోలీసులు తెలిపారు.