Girl murder : నేరస్థులు ఎంత తెలివిని ఉపయోగించినా ఒక్కోసారి సులువుగా దొరికిపోతుంటారు. ఎందుకంటే వాళ్లు చేసే ఏదో ఒక చిన్న పొరపాటు వాళ్లను పట్టిస్తుంది. తాజాగా మహారాష్ట్రలోని పుణె సిటీలో అలాంటి ఘటనే జరిగింది. పుణెలో రెండేళ్ల చిన్నారి హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. హంతకుడి హుడీపై రాసి ఉన్న మూడు పదాలు పోలీసులు ఈ కేసును ఛేదించడానికి తోడ్పడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పుణెలో రెండేళ్ల బాలిక హత్యకు గురైంది. చిన్నారి తల్లి, ఆమె ప్రియుడు కలిసి చిన్నారిని హత్య చేశారు. తర్వాత తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని నిందితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
హత్య జరిగిన రోజు చిన్నారి ఇంట్లోకి ఓ వ్యక్తి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. అయితే అందులో ముఖం సరిగా కనిపించకపోవడంతో అతను ఎవరు అనేది గుర్తించడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. దాంతో నిందితుడు ధరించిన హుడీపైగల మూడు మరాఠీ పదాలపై పోలీసుల దృష్టి పడింది. ఆ మూడు పదాల ఆధారంగా కేసును విచారించారు.
ఆ హుడీపై ‘సంఘర్ష్ గ్రూప్, ఖిర్పురి’ అని మరాఠీలో రాసి ఉంది. ఖిర్పురి గ్రామం అకోలా జిల్లాలో ఉన్నది. దాంతో పోలీసులు ఖిర్పురి గ్రామానికి వెళ్లి నిందితుడి గురించి ఆరా తీశారు. దాంతో నిందితుడు దొరికిపోయాడు. అతడిని పుణెకు తీసుకెళ్లి విచారించగా చిన్నారి తల్లితో తనకు వివాహేతర బంధం ఉన్నట్లు తెలిపాడు. ఆ బంధానికి అడ్డుగా ఉందనే ఇద్దరూ కలిసి చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దాంతో చిన్నారి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Cabinet Sub Committee | జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశం
Supreme Court | ఆ నిర్దేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ
Viral news | యువతి పుర్రెలో 77 సూదులు గుచ్చిన మంత్రగాడు.. చివరికి ఏమైందంటే..!
Viral news | జింకను చుట్టిపడేసిన కొండచిలువ.. ఆఖరి క్షణంలో ఏం జరిగిందంటే..Video