వారణాసి: కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఉత్తరప్రదేశ్లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ (ఐసీఏఆర్-ఐఐవీఆర్) పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఏక కాలంలో వంకాయలు, టమాటాలు, మిరపకాయలు పండే మొక్కను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదన్నారు. గతంలో ఆలు, టమాటాలు పండే ఓ మొక్కను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి పొమాటో అని పేరుపెట్టారు.