న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ సీఎన్జీ పంప్ (CNG Pump) సిబ్బంది హత్యకు గురయ్యారు. ఢిల్లీ గురుగ్రామ్ (Gurugram) ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న సీఎన్జీ పంప్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని దుండగులు హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఎన్జీ బంక్‌ను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
సీఎన్జీ పంప్లో ముగ్గురు ఉద్యోగులు హత్యకు గురయ్యారని గురుగ్రామ్ డీసీపీ వీరేంద్ర విజ్ చెప్పారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. అయితే వారివద్ద ఉన్న డబ్బును ఎవరూ ఎత్తుకెళ్లలేదని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.