బెంగళూరు, జూలై 10: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. స్నేహితురాలి ఇంట్లో ఉన్న ఓ మహిళ(35)పై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడటమేగాక, బాధితురాలిని బెదిరించి ఆమె నుంచి 13 వేల రూపాయల్ని ఆన్లైన్ ద్వారా కాజేశారు. అంతేగాక ఆ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్, ఎల్ఈడీ టీవీ, వాషింగ్ మెషిన్.. సహా విలువైన వస్తువుల్ని నిందితులు పట్టుకుపోయారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
గత సోమవారం రాత్రి ఆగ్నేయ బెంగళూరులోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా హెబ్బాగోడికి చెందిన నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ‘స్నేహితురాలు పిలిస్తే ఆమె ఇంటికి వెళ్లా. హఠాత్తుగా ముగ్గురు వ్యక్తులు తలుపులు తోసుకొని ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మాపై దాడికి దిగారు’ అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది.