కొత్తగూడెం క్రైం, జనవరి 12: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా మద్దేడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.
ఈ క్రమంలో ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి. సుమారు 30 నిమిషాలపాటు భీకర పోరు జరిగింది. కాల్పులు ముగిసిన అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వారికి చెందిన కొన్ని ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.