శ్రీనగర్: భారత ఆర్మీ ట్రక్ ఒకటి అదుపు తప్పి 700 అడుగుల లోయలోకి పడిపోవడంతో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సైనిక కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీ నగర్‌కు 44 నంబర్ జాతీయ రహదారి గుండా పోతుండగా రాంబన్ జిల్లాలో బ్యాటరీ చష్మా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ, పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టారని.. అయితే ఘటనా స్థలిలోనే సైనికులు మృతి చెందారని అధికారులు చెప్పారు.