హైదరాబాద్ : పంజాబ్లోని లుధియానాలోని(,Ludhiana) ఇండస్ట్రియల్ ఏరియాలోని డీప్ టూల్స్ చేతి పనిముట్ల తయారీ ఫ్యాక్టరీలో(Deep Tools industry) గ్యాస్ లీక్ అయిన ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించగా మరో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మురుగునీటిని శుభ్రం చేస్తుండగా గ్యాస్ లీక్ అయినట్లు ప్రాథమిక అంచానకు వచ్చామని లుధియానా డీసీపీ (రూరల్) జస్కిరంజిత్ సింగ్ తేజా తెలిపారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా అస్వస్థతకు గురైన ఇద్దరి హాస్పిటల్కు తరలించామన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని లుధియానా పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ స్పష్టం చేశారు.