ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రజ్ ఏరియాలోగల గెలాక్సీ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే మంటల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అగ్ని కీలలు ఎగిసిపడగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత హోటల్లోని వివిధ గదుల్లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు క్షతగాత్రులు వెలికితీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సజీవ దహనమైన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Maharashtra: Three people dead and two injured in a fire that broke out in the Galaxy Hotel in the Santacruz area of Mumbai: Mumbai Police https://t.co/XCgELU5YKe pic.twitter.com/PZhty0OWPZ
— ANI (@ANI) August 27, 2023