భోపాల్: మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటలకు ఓ బాలికపై ముగ్గురు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన ఇంటి సమీపంలోని బోరు బావి నుంచి నీటిని తేవడం కోసం వెళ్లగా.. నిందితులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకెళ్లి, ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడి చేశారు.
అనంతరం ఆమెను వదిలేసి, పారిపోయారు. బాలిక గాయపడి, అపస్మారక స్థితిలో సంఘటన స్థలంలోనే పడిపోయింది. తర్వాత గాయపడిన బాలికను గుర్తించి, లౌర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే దవాఖానలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలం నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో నాలుగేండ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలు శనివారం తన అమ్మమ్మ వద్ద తారకేశ్వర్లోని రైల్వే షెడ్లో నిద్రపోయింది. ఆ సమయంలో ఆమెను ఎవరో అపహరించారు. బాధితురాలిని శనివారం మధ్యాహ్నం ఓ కాలువ వద్ద అపస్మారక స్థితిలో గుర్తించారు.