రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరగనున్న భారీ నిరసన ప్రదర్శన ప్రకంపనలు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళుతున్న లక్షలాది మంది నిరసనకారులను మార్గమధ్యంలోనే అడ్డగించి రైళ్ల నుంచి అదుపులోకి తీసుకుంటున్నారని జంతర్ మంతర్ 2.0కి పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), వామపక్షాలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా కనీసం 10,000 మందిని అదుపులోకి తీసుకున్నారని సీజేపీ సహ-కన్వీనర్ అశుతోశ్ రాంకా ట్వీట్ చేశారు.
- పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
- సీజేపీ, వామపక్షాల ఆరోపణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరగనున్న భారీ నిరసన ప్రదర్శన ప్రకంపనలు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళుతున్న లక్షలాది మంది నిరసనకారులను మార్గమధ్యంలోనే అడ్డగించి రైళ్ల నుంచి అదుపులోకి తీసుకుంటున్నారని జంతర్ మంతర్ 2.0కి పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), వామపక్షాలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా కనీసం 10,000 మందిని అదుపులోకి తీసుకున్నారని సీజేపీ సహ-కన్వీనర్ అశుతోశ్ రాంకా ట్వీట్ చేశారు. రైళ్లలో, రైల్వే స్టేషన్ల వద్ద ప్రజలను పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలున్న అనేక వీడియోలు గత 24 గంటల్లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
మధ్యప్రదేశ్‌లో గోవా ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వెళుతున్న సుమారు 15 మంది విద్యార్థులను పోలీసులు దింపివేశారు. కొంతమంది యువకులను పోలీసులు బలవంతంగా రైలు నుంచి దింపుతున్న దృశ్యాలున్న వీడియో ఒకటి బయటకు రావడంతో కలకలం ఏర్పడింది. పోలీసుల చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ యువకులు ప్లాట్‌ఫామ్‌పై నిరసన చేపట్టారు. అనంతరం పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేశారు. విద్యార్థులను రైలు నుంచి దించి ఆ తర్వాత విడిచిపెట్టినట్టు ఇటార్సీ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సంజయ్ చౌక్సే తెలిపారు. విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ వారు తమ ఇష్టపూర్వకంగానే ఒక హోటల్లో ఉంటున్నారని ఆయన చెప్పారు.
విద్యార్థులను అదుపులోకి తీసుకున్న వీడియోపై స్పందిస్తూ అసలు అత్యవసర పరిస్థితిని ఎందుకు ప్రకటించకూడదు? అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ఇంకా ప్రారంభం కూడా కాని నిరసన కోసం ప్రజలను అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం, కొట్టడమా? ఈ ప్రభుత్వం సృష్టించిన అరాచకం, వారు ఊహించిన దానికంటే త్వరగానే వారి అధికార పీఠాలనే కదిలిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లో కూడా సీజేపీ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కోల్‌కతాలో సీజేపీ బృందాన్ని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారని రాంకా ఆరోపించారు. కాలి ఎముక విరిగిన గాయం నుంచి కోలుకుంటున్న తమ సంస్థ సహ-ఇన్చార్జ్ దీపక్ బలియాన్‌ను రాజస్థాన్ పోలీసులు అల్వార్‌లోని ఆయన నివాసం నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది.
పీజీలు, హాస్టళ్ల వద్ద తనిఖీలు
ఢిల్లీలోని పీజీలు, హాస్టళ్ల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారని సీజేపీ ఆరోపించింది. మరోవైపు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి ఉమ్మడిగా పిలుపునిచ్చిన వామపక్ష సంఘాలలో ఒకటైన ఎస్ఎఫ్ఐ తమ సభ్యులు ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు నివాసాలకు వెళుతున్నారని ఆరోపించింది. పెద్ద ఎత్తున గృహ నిర్బంధాలు జరుగుతున్నాయని ఏఐఎస్ఏ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

