న్యూఢిల్లీ: అర్ధరాత్రి దాటినా నిద్ర రాకపోవటం, ఆలస్యంగా దినచర్యను ప్రారంభించటం.. ఇదంతా టైప్2 డయాబెటిస్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. సమయానికి తిండి, నిద్ర పాటించే వారితో పోల్చితే..
లేట్ నైట్ నిద్రపోయే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువ. వీరికి మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు తోడయ్యే ప్రమాదం కూడా ఉన్నదని అధ్యయనం వెల్లడించింది.