న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ భాషాంహకార వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడని వారు దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అన్నారు. హిందీని ప్రేమించని వారు విదేశీయులుగా లేదా విదేశీ శక్తులతో లింకులు ఉన్న వారిగా పరిగణించబడుతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో భాష అంశంపై జరుగుతున్న చర్చకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ నిషాద్ స్పందిస్తూ భారత్లో నివసించాలనుకునే వారు తప్పనిసరిగా హిందీని ప్రేమించాల్సిందేనని అన్నారు. ఇండియా అంటే హిందుస్థాన్ అని రాజ్యాంగం చెబుతున్నదని, అంటే హిందీ మాట్లాడేవారి ప్రాంతమని అర్థం అంటూ మంత్రి విచిత్రమైన భాష్యం చెప్పారు.