తిరువనంతపురం: ఒక ఆలయం వద్ద రోబో ఏనుగు సందడి చేసింది. (Robo Elephant) భారీ ఏనుగును పోలి ఉన్న ఇది అచ్చంగా అసలు ఏనుగును తలపించింది. చెవులు, తోక ఊపడంతోపాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది. ఎంతో ఆకట్టుకుంటున్న రోబో ఏనుగుతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా కేరళలో జరిగే ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తారు. అయితే కొన్నిసార్లు ఏనుగులు ఆగ్రహం చెందడంతో ఊహించని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి.
కాగా, ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జంతు సంక్షేమ సంస్థ (పెటా) చొరవ చూపింది. పెరుంకడవిలాలోని బాలభద్రకాళి క్షేత్రం ట్రస్ట్‌కు రోబో ఏనుగును విరాళంగా ఇచ్చింది. చెవులు ఊపుతూ పెద్ద తొండంతో అచ్చం పెద్ద ఏనుగు మాదిరిగా ఉన్న ఈ రోబో ఎలిఫేంట్కు పూజలు, హారతులతో స్వాగతం పలికారు. అలాగే రోబో ఏనుగు ముందు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.
మరోవైపు అచ్చం ఏనుగును పోలిన రోబో ఎలిఫేంట్కు సంబధించిన వీడియో క్లిప్స్‌ను పెటా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆలయ సంప్రదాయాల్లో ఒక ముందడుగుగా అభివర్ణించింది. ‘దేవీ దాసన్.. సాంకేతిక అద్భుతం. బలభద్రకాళి క్షేత్రానికి చేరుకున్నది. భవిష్యత్తులో నిజమైన ఏనుగులు వాటి సహజ ఆవాసాలలో స్వేచ్ఛగా ఉండేలా ఇది చూస్తుంది. ఇది ఒక చారిత్రక మలుపు’ అని పేర్కొంది.
కాగా, 2023లో త్రిస్సూర్ జిల్లాలోని ఇరింజడప్పిల్లి కృష్ణ ఆలయంలో దేశంలోనే తొలిసారి రోబో ఏనుగును ప్రవేశపెట్టారు. నాటి నుంచి పలు దేవాలయాలు ఈ చర్యను స్వాగతించాయి. ఆలయ ఉత్సవాల్లో అసలు ఏనుగులకు బదులుగా రోబో ఏనుగులను వినియోగిస్తున్నాయి.
🎉 History in the making!
Devi Dasan has arrived at Sree Balabhadrakali Kshetram —ushering in a future where real elephants stay free in their natural habitats! 🌱🐘@paro_nair #MechanicalElephant #RoboticDeviDasan #PETAIndia pic.twitter.com/920b0xlLz7
— PETA India (@PetaIndia) March 7, 2025
A breakthrough in temple traditions!
Devi Dasan is a technological wonder that allows elephants to stay in their jungle homes, where they belong. 🌿🐘@paro_nair #MechanicalElephant #RoboticDeviDasan #PETAIndia pic.twitter.com/nNQajiig6c
— PETA India (@PetaIndia) March 7, 2025
B Adarsh, President of the Sree Balanhadrakali Kshetram Trust shares how Devi Dasan represents progress for animals and tradition. 🐘#MechanicalElephant #RoboticDeviDasan #PETAIndia pic.twitter.com/B57zXJdEQS
— PETA India (@PetaIndia) March 8, 2025