సియోల్ : స్టోర్స్, ఫాస్ట్ ఫుడ్ చైన్స్‌లో సెల్ఫ్ చెకౌట్ సెంటర్స్ గురించి మనం విన్నా, ఎలాంటి స్టాఫ్ లేని రెస్టారెంట్‌ను మాత్రం ఎవరూ చూసిఉండారు. అయితే లిలీ హున్ అనే ఫుడ్ వ్లోగర్ సియోల్‌లో సిబ్బంది లేని ఓ నూడుల్స్ స్టోర్‌ను ఇన్స్టాగ్రాం రీల్లో కండ్లకు కట్టింది. ఈ వీడియోను (Viral Video) నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి తెగ వైరలవుతోంది.
కంటెంట్ క్రియేటర్ అర్ధరాత్రి ఈ 24 గంటల పాటు పనిచేసే స్టోర్‌లో అడుగుపెట్టింది. ఇక్కడున్న పదార్ధాలతో పాటు ఫ్రిడ్జ్‌లో ఉన్న డ్రింక్స్‌ను కూడా కస్టమర్లు ఎంజాయ్ చేయవచ్చని ఏకంగా డెమో ఇచ్చింది. అక్కడే ఉండే ఆటోమేటిక్ మెషీన్లో కార్డు లేదా క్యాష్తో పేమెంట్ చేయవచ్చని, ఈ రెస్టారెంట్లో అసలు ఉద్యోగులే ఉండరని తెలిపింది.
మరి స్టోర్స్‌లో దొంగతనం జరిగితే ఎలా అనే అనుమానం వచ్చే వారికి అక్కడ సీసీటీవీ కెమెరాలున్నాయని లిలీ చెప్పుకొచ్చింది. మీకు మీరే డబ్బు పే చేస్తారని యజమానులకు నమ్మకం కూడా ఉందని పేర్కొంది. అక్కడ ఉచితంగా దొరికే పలు సైఔడ్ డిష్‌ల గురించి కూడా లిలీ వివరించింది. నూడుల్స్‌తో పాటు ఆమె స్ప్రౌట్స్, స్ప్రింగ్ ఆనియన్, ఫిష్ కేక్స్‌ను కూడా టాపింగ్స్‌గా జోడించడం ఈ రీల్లో చూడొచ్చు.
Read More :