BJP Leader Wears Shoes | ఆరేళ్ల తర్వాత బూట్లు ధరించిన బీజేపీ నేత.. ఎందుకంటే?
BJP Leader Wears Shoes | బీజేపీ నేత ఆరేళ్ల తర్వాత బూట్లు ధరించాడు. (BJP Leader Wears Shoes) మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో తన కాళ్లకు బూట్లు తొడిగాడు. ఆరేళ్ల కిందట చేసిన ప్రతిజ్ఞను తాజాగా నెరవేర్చాడు.
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఆరేళ్ల తర్వాత బూట్లు ధరించాడు. (BJP Leader Wears Shoes) మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో తన కాళ్లకు బూట్లు తొడిగాడు. ఆరేళ్ల కిందట చేసిన ప్రతిజ్ఞను తాజాగా నెరవేర్చాడు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుప్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాందాస్ పూరీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కాళ్లకు చెప్పులు లేదు బూట్లు ధరించనని 2017లో ప్రతిజ్ఞ చేశాడు.
కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే రాందాస్ పూరీ తన మాటకు కట్టుబడి ఉన్నాడు. సొంత మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక పోవడంతో గత ఆరేళ్లుగా కాళ్లకు చెప్పులు లేదా బూట్లు ధరించలేదు. పార్టీ సమావేశాల్లో కూడా అలాగే పాల్గొనేవాడు.
మరోవైపు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనుప్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాందాస్ పూరీ తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. శనివారం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో తన కాళ్లకు బూట్లు ధరించాడు. చౌహాన్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
रामदास पुरी जैसे कार्यकर्ता पार्टी की शक्ति और पूंजी हैं…
अनूपपुर के भाजपा जिला अध्यक्ष श्री रामदास पुरी जी ने संकल्प लिया था कि जब तक प्रदेश में भाजपा की सरकार नहीं बनेगी, तब तक वे जूते चप्पल नहीं पहनेंगे।
प्रदेश में भाजपा की सरकार बन गयी और उनका संकल्प पूरा होने पर हमने… pic.twitter.com/3Q50QThen3
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 23, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

